బిజ్వార్ లోఉల్లాసంగా కొనసాగుతున్నజిల్లాస్థాయిభజన పోటీలు.

బిజ్వార్ లోఉల్లాసంగా కొనసాగుతున్నజిల్లాస్థాయిభజన పోటీలు.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి భజన పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మూడో రోజుభజన పోటీలుపోటాపోటీగా నిర్వహించారు. నిర్వాహకులు సుధాకర్ రెడ్డి, దోరోళ్ల కృష్ణయ్య, దాసరి రామాంజనేయులు నేతృత్వంలో పోటీలు వేడుకగా చేపడుతున్నారు. నర్వ, లంకాల, ధన్వాడ రెండు టీంలు, పల్లెగడ్డ, చిన్నపోర్ల రెండు టీంలు, జంగం రెడ్డిపల్లి, గున్ముక్ల, పులిమామిడి, పూసల్ పాహడ్, జక్కన్న పల్లి, ఎడవెల్లి, నిడుగుర్తి, ధన్వాడ, అవుసలోని పల్లి, భజన టీం సభ్యులు పోటీ పడుతున్నారు.

ఆసక్తి కల భజన టీంలు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా పేర్లు నమోదు చేసుకొని ఈ నెల 26 వరకు జరిగే జిల్లా స్థాయి భజన పోటీల్లో పాల్గొనాలని కోరారు.గెలుపొందిన భజన టీంలకు శ్రీరామ నవమి రోజు మొదటి, రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందని అన్నారు. భజన పోటీలు రోజు సాయంత్రం 7:30 గంటలకు శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్యాట శ్రీనివాస్,నాగేష్ గౌడ్, నేడుగం రాఘవేంద్ర, హెచ్. నర్సింహా, రాజప్ప,పోలీస్ హన్మి రెడ్డి,ఆంజనేయులు గౌడ్,వెంకటప్ప, మహేష్ గౌడ్, అశోక్, మారుతి, శ్రీనివాస్, అశోక్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.