మక్తల్ నియోజకవర్గానికి రూ.320 కోట్లతో హ్యామ్ రోడ్లు..
- 13న పైలాన్ ఆవిష్కరించి పనులు ప్రారంభించనున్న
- మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి
మక్తల్, ఆంధ్రప్రభ : మఖ్తల్ నియోజకవర్గానికి మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో హ్యామ్ (HAM) రోడ్ల అభివృద్ధి పనుల కోసం రూ.320 కోట్ల నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ నెల 13న ఉదయం 9.30 గంటలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, డాక్టర్ వాకిటి శ్రీహరి పైలాన్ ఆవిష్కరించి పనులకు శ్రీకారం చుడతారని వెల్లడించారు.
పైలాన్ ఏర్పాటు పనులను పరిశీలించిన అనంతరం కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, మార్కెట్ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మాగనూరు మండల అధ్యక్షుడు శివరాం రెడ్డి, వాకిటి హనుమంతు మీడియాతో మాట్లాడారు.
వారి వివరాల ప్రకారం హ్యామ్ రోడ్ల పథకం కింద మంజూరైన నిధులు ఇవి:
- మఖ్తల్ – నారాయణపేట ఫోర్‌లైన్ రోడ్డుకు రూ.237.71 కోట్లు
- మరికల్ – మినాస్‌పూర్ – లింగంపల్లి రోడ్డుకు రూ.49.57 కోట్లు
- ఆత్మకూరు – మరికల్ రోడ్డుకు రూ.22.47 కోట్లు
- మాగనూరు మండలం నల్లగట్టు – హిందూపూర్ రోడ్డుకు రూ.10.49 కోట్లు
సోమవారం ఉదయం 9.30 గంటలకు మఖ్తల్ పట్టణంలోని గురుకులం సమీపంలో నారాయణపేట రోడ్డుపై పైలాన్ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నారాయణపేట రహదారి దశాబ్దాలుగా అధ్వాన్నంగా ఉండేదని, మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో డబుల్ లైన్ రహదారిని ఫోర్‌లైన్‌గా అభివృద్ధి చేయడానికి రూ.237.71 కోట్ల నిధులు మంజూరు చేయించారని పేర్కొన్నారు. మఖ్తల్ నుంచి సింగారం గేట్ వరకు డివైడర్, మొక్కల పెంపకం, వీధి దీపాలతో ఆధునిక ప్రమాణాల మేరకు రహదారిని అభివృద్ధి చేసి ఎనిమిది నెలల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు వల్లంపల్లి లక్ష్మణ్, జిల్లా నాయకులు నారాయణ, శంకర్, కర్రెం అంజప్ప, బహదూర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
