నవాబుపేట ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన నరేందర్
నవాబుపేట ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన నరేందర్
నవాబుపేట, ఆంధ్రప్రభ : నవాబుపేట మండల నూతన ఎస్ఐగా నరేందర్ ఆదివారం బాధ్యతలు స్వీకరించాడు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై విక్రం బదిలీపై వెళ్లడంతో వనపర్తి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై నవాబుపేటలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై పర్వతాపూర్ మైసమ్మ ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవాబుపేట మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేస్తానన్నారు.
