రెండోవ రోజు ఘనంగా ఉర్సు గంధ మహోత్సవం…
రెండోవ రోజు ఘనంగా ఉర్సు గంధ మహోత్సవం…
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మండలంలోని చీమలపాడు ఎఎఎంటికె దర్గా అండ్ దర్బార్ షరీఫ్ లో అలుపెరగని అన్నదాత నఖీబుల్ ఔలియా సూఫీ ముహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బొగ్దాది బాబా (ర అ) వారి ధర్మపత్ని ముహమ్మద్ ఖమ్రున్నిసా బేగం ఐదవ ఉర్సు మహోత్సవాన్ని రెండవ రోజు మంగళవారం దర్బార్ పీఠాధిపతి, సజ్జదా నషీన్ పీర్జాదా ముహమ్మద్ ఖ్వాజా మొహియుద్దీన్ షా తాజ్ ఖాదరీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భారతదేశం నలుమూలల నుండి వచ్చిన బాబా వారి భక్తులకు కుల మత వర్గ విచక్షణ లేకుండా వేలాదిమందికి మహా దివ్య అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ఉర్సు ప్రారంభం, మంగళవారం సందల్ షరీఫ్ (గంధ మహోత్సవం) బుధవారం ఉర్సు ముగింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వాస్తు శిల్పి దైవాజ్ఞ జాఫర్ సాధిక్,బొగ్దాది, తాజ్ ఖాదర్ బాబు, పాల్గొని బాబా వారి భక్తులకు మహా దివ్య అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. నఖీబుల్ఔలియా అతావుల్లా షరీఫ్ షా ఖాదరీబాబా అమ్మాజాన్ దర్గాలను భక్తులు దర్శించి బాబా వారి ఆశీస్సులు పొందారు. బాబా వారి అమ్మాజాన్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
