రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలి..

రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలి..

ఏవో ముత్యాల నాగరాజు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఈ యాసంగి సీజన్ 2025-26 సంవత్సరానికి గాను రైతు భరోసా పథకం కింద రైతులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త దరఖాస్తులు స్వీకరిస్తున్నందున గత నెల 28 వరకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, గతంలో పట్టా పాస్ పుస్తకాలు పొంది రైతు భరోసా పొందని రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని చౌటుప్పల్ మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు తెలిపారు. దరఖాస్తుకి కావలసిన పత్రాలు అప్లికేషన్ ఫామ్, పట్టా పాస్ పుస్తకం, ఆధార కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీలను జత చేసి తమకు సంబంధించిన రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణ అధికారి కి అందజేయాలని, ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. చౌటుప్పల్ మండలంలో కొత్తగా పట్టా పొందిన రైతుల సంఖ్య 553 ఉందని, ఈ రైతులందరూ 25వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని ఏవో ముత్యాల నాగరాజు తెలిపారు. అదేవిధంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతన రైతులు కూడా ఈనెల 25వ తేదీ లోగా రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏవో పూజ తెలిపారు.