బీజేపీతోనే నగరాభివృద్ధి..

బీజేపీతోనే నగరాభివృద్ధి..

వరంగల్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక నజర్
వరంగల్ కు భారీగా నిధులు కేటాయిస్తున్న ప్రధాని.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి నిధులు కేటాయించడం అభినందనీయం.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్.
వరంగల్ మునిసిపల్ కార్యాలయం వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం.

కాశీబుగ్గ, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ భారీగా నిధులు కేటాయిస్తున్నారని మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. కేంద్ర పథకం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకానికి నిధుల సమీకరణ లో భాగంగా విదేశీ సహాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కలిసి కేంద్రం నిధుల్ని సమీకరించడం తో గంట రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం గ్రేటర్ మున్సిపల్ కార్యాలయం వద్ద క్షీరాభిషేకం చేశారు. అనంతరం గంట రవికుమార్ మాట్లాడుతూ ఈ పథకం కింద 5257.20 కోట్లతో చేపట్టే పనులకు పాలనా పరమైన అనుమతి మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమన్నారు. కేంద్రం భారీగా నిధులు ఇస్తున్న ఖర్చు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలం అవుతున్నారని పేర్కొన్నారు.

గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని గంట రవికుమార్ అన్నారు. ఇప్పటికే ఎయిర్పోర్టు మంజూరు చేసిన కేంద్రం తాజాగా అండర్ డ్రైనేజీకి నిధులు మంజూరు చేసిందని.. ఇప్పటికే స్మార్ట్ సిటీ లో భాగంగా అనేక నిధులు ఇచ్చి నగరం రూపురేఖలు మార్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు తప్ప అభివృద్ధి చేసింది లేదని విమర్శించారు. ఓట్ల కోసం ఇచ్చే హామీలు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకున్న దాఖలు లేవని దుయ్యబట్టారు. కేంద్రం నిధులు ఇస్తున్న.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. బండ్ పనుల్లో ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. గ్రేటర్ వరంగల్ ఇప్పటివరకు అభివృద్ధి చెందిందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అని స్పష్టం చేశారు. వరంగల్లో బిజెపి ఎమ్మెల్యే కానీ ఎంపీ అభ్యర్థి లేకపోయినా కూడా కేంద్రం నిధులు ఇస్తుందని.. అదే అధికారంలో ఉంటే ఇంకేం నిధులు వస్తాయని గంట రవికుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, ప్రత్యేక వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్, బిజెపి కార్పొరేటర్ గందె కల్పనా నవీన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్, బైరి నాగరాజు, పదాధికారులు, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బిజెపి నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply