కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
కార్యకర్తలను వేధిస్తే ఊరుకోను: మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
హనుమకొండ, ఆంధ్రప్రభ: బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను అధికార కాంగ్రెస్ వేధిస్తే ఊరుకోనని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. మంగళవారం కాపువాడలోని మాతా గార్డెన్‌లో పులి రజనీకాంత్ అధ్యక్షతన 7, 10 డివిజన్ల బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పార్టీ కోసం పని చేస్తున్న వారిని గుర్తించి, రాబోయే రోజుల్లో వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీని మోసం చేసి వెళ్లిన వారిని పట్టించుకోవద్దని సూచించారు. బీఆర్‌ఎస్ పార్టీ త్వరలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి, ఓటరు మ్యాపింగ్ చేపట్టాలని కోరారు.
బూత్ స్థాయిలో ఓటర్లకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. డివిజన్ వారీగా స్థానిక సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాడితే కార్యకర్తలపై, తనపై కేసులు నమోదు చేస్తున్నారని, కేసులు తనకు కొత్త కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉడుతల సారంగపాణి, సీనియర్ నాయకులు నయీముద్దీన్, నాయకులు కొండ శ్రీనివాస్, ఎండీ ఖలీల్, హైమావతి, సుదర్శన్, ఈశ్వర్, పొదిలి అనిల్, వరుణ్, సుధాకర్, డివిజన్ ఇన్‌చార్జులు విజయ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
