విద్యార్థినులకు పుస్తకాల పంపిణీ..

విద్యార్థినులకు పుస్తకాల పంపిణీ..

నర్సంపేట, ఆంధ్రప్రభ : ఎన్‌ఎఫ్‌హెచ్‌సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కలాం మిషన్ విద్యా విజ్ఞాన్ కార్యక్రమంలో భాగంగా, నల్లబెల్లి మండలంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), ముదుచెక్కలపల్లి లో విద్యార్థినుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం. శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌హెచ్‌సి ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన విద్యార్థినులకు ప్రేరణాత్మక సందేశం అందిస్తూ సమయపాలన ప్రాముఖ్యత, సరైన వృత్తి ఎంపిక, భవిష్యత్ విద్యా అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

అలాగే ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థినులకు పాలిటెక్నిక్ మరియు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రవేశాలకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌హెచ్‌సి సేవాసైనికుడు పూల్‌సింగ్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థినులకు మార్గనిర్దేశం చేశారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌సి ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విద్యార్థినులకు ఉన్నత విద్యపై స్పష్టమైన అవగాహన కల్పించి వారి భవిష్యత్ లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని పాఠశాల నిర్వహణ అభిప్రాయపడింది.

Leave a Reply