పేద ప్రజల స్వంత ఇంటి కళ సాకారం : కడియం శ్రీహరి

చిలుపూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగా పేదలు ఆశించిన స్వంత ఇంటి కల నెరవేరిందని ఎంఎల్ఎ కడియం శ్రీహరి తెలిపారు. చిలుపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆదివారం మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ.. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పార్టీలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడవెల్లి లావణ్య మల్లారెడ్డి చిల్పూర్ ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు తోపాటు పలువురు పాల్గొన్నారు.
