బాలలం మేము బాలలం..
బాలలం మేము బాలలం..
అద్భుత ప్రదర్శనతో. ఆకట్టుకున్న చిన్నారులు.
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ:
నగరంలోని బాల భవన్ వేదికగా చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం అభినందనీయమని డీఈవో పార్సీ అశోక్ అన్నారు. నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద గల బాలభవన్ లో నిర్వహించిన బాల భవన్ ప్రతిభ పాటవ ప్రదర్శన కార్యక్రమానికి డీఈవో ముఖ్యఅతిథిగా బాల భవన్ ఫౌండర్ నారాయణి సింహాచలం వారసులు మామి డిపూడి ప్రేమలత ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీఈవో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన పదిమంది చిన్నా రులకు నగదు పురస్కారం అందజేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్మించిన నృత్త్యాలు ఆద్యంతమూ అల రించాయి. ‘అంతయు నీవే అంటూ చేసిన ప్రారంభనృ త్యం, బాలలం మేము ఒక్కటే.. తరువాత అతి క్లిష్టమై జడకొప్పు డ్యాన్సును 8మంది చిన్నారులు అత్యంత మనోహరంగా ప్రదర్శించారు. అదేవిధంగా అన్నమయ్య కీర్తనలతో ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. చిన్నారుల ప్రదర్శనను చూసి తల్లిదం డ్రుల చప్పట్లతో ఆ ప్రాంత మంతా మార్మోగింది. బాల్ భవన్ లో చిన్నారుల శిక్షణలో భాగంగా జడ కొప్పు నృత్యం విశేషంగా ఆకట్టుకుంది.జాదు యుగంధర్ రంగ నాథ్ మ్యాజిక్ ప్రదర్శన ప్రత్యేకంగా అలరించింది. వేదికపై జాదూ యుగంధర్ ఇంద్రజాలం ప్రదర్శించారు.
ఆకట్టుకున్న కర్ర సాము,భాంగ్రా నృత్యం, యోగా ప్రదర్శన…
భాంగ్రా నృత్యము, యో గా ప్రదర్శన, శ్లోకాలు, కర్ర సాము ఎంత గానో అల రించాయి, మధ్యలో చిన్నారి దివిష వివిధ దేశాల రాజధానులు, రకరకాల శ్లోకాలను గబా గబా చెపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులను ప్రతిభవంతులుగా తీర్చిదిద్దడం తమ లక్షమని బాల భవన్ సూపరింటెండెంట్ ఉమా బాల తెలిపారు.వేసవి విడిదిలో బాల భవన్ లో నిర్వహించే శిక్షణా తరగతులలో చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని బాల భవన్ సూపరింటెండెంట్ ఉమా బాల అన్నారు. ఈ సంవ త్సరం శిక్షణా తరగతుల్లో 750 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింద న్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వపు సూపరింటెండెం ట్ విఠల్ ప్రభాకర్, పుష్పలత, వెంకట లక్ష్మి నటరాజ్, శ్వేత, సోనాలి, రిచా, మాధవి, నవీన్ రాంచందర్, గణేష్, మాధవి, విజయ. పవన్ తది తరులు పాల్గొన్నారు.
