టాస్ గెలిచిన గుజరాత్.. బౌలింగ్ ఎంచుకున్న గిల్!

టాస్ గెలిచిన గుజరాత్.. బౌలింగ్ ఎంచుకున్న గిల్!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో అత్యంత కీలకమైన ‘క్వాలిఫయర్-1’ సమరం మొదలైంది. ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఈ పోరులో గుజరాత్ జట్టు టాస్ గెలిచింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ ఎంచుకున్నారు. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుగా బౌలింగ్ చేయడమే సరైన నిర్ణయమని గిల్ భావించినట్లు తెలుస్తోంది. ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడానికి రెండు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

ఆర్‌సీబీ బ్యాటింగ్ తుది జట్టు : కోహ్లీ, వెంకీ, పడిక్కల్, పాటిదార్, కృనాల్, డేవిడ్, జితేష్, భువనేశ్వర్, హేజిల్‌వుడ్, డఫీ, రసిఖ్.

గుజరాత్‌ టైటన్‌ తుది జట్టు: గిల్, సుదర్శన్, బట్లర్, నిశాంత్ సింధు, సుందర్, హోల్డర్, రషీద్, ఖేజ్రోలియా, రబడ, సిరాజ్, ప్రసిద్ధ్.

Leave a Reply