అగ్నిప్రమాధాలపై ఫైర్ సిబ్బంది అవగాహన కార్యక్రమం

అగ్నిప్రమాధాలపై ఫైర్ సిబ్బంది అవగాహన కార్యక్రమం

మోత్కూర్, ఆంధ్రప్రభ
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని ఎస్ ఎం ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఫైర్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు పాటించాల్సిన భద్రత పై సూచనలు చేసి రెస్టారెంట్ సిబ్బందికి సి ఓ 2, డ్రై కెమికల్ పౌడర్ ఎలా వాడాలో వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఫైర్ సిబ్బందితో పాటు కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న గౌడ్ , స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఆర్. భీముడు,లీడింగ్ ఫైర్ ఫైటర్ జి వెంకటేశ్వర్లు,ఫైర్ ఫైటర్ టెక్నికల్ డి నరేష్,ఫైర్ ఫైటర్స్ బి. రవీందర్ నాయక్, జె అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply