మారేపల్లికి ఎమ్మెల్యే రాక

మారేపల్లికి ఎమ్మెల్యే రాక
డోంగ్లి, ఆంధ్రప్రభ: మండలంలోని మారేపల్లి గ్రామపంచాయతీ భవన కార్యాలయ ప్రారంభోత్సవం, ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంత రావు హాజరుకానున్నట్లు డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగజానంద్ దేశాయ్ తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
