రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ..

బోధన్, ఆంధ్రప్రభ ; వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యంత్ర పరికరాలను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ మేరకు శుక్రవారం సాలురా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యంత్రాలను అందజేశారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడం ఉత్పధకతను పెంచడం లక్ష్యంగా సన్న చిన్న కారు రైతులకు వీటిని అందజేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు.ఈ పంపిణీ కార్యక్రమంలో సాలుర సర్పంచ్ సోక్కం లావణ్య, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అశోక్ జిల్లా ప్రతినిధి పల్లె రమేష్ హాజరయ్యారు..
