భీమ్‌గల్ వాసికి ‘తెలంగాణ రత్న’ అవార్డు

భీమ్‌గల్ వాసికి ‘తెలంగాణ రత్న’ అవార్డు

సామాజిక సేవకురాలు అంకం జ్యోతి జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలానికి చెందిన సామాజిక సేవకురాలు అంకం జ్యోతి జాతీయ స్థాయి ‘తెలంగాణ రత్న’ అవార్డు-2026కు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘పారాచుట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఈ అవార్డును ప్రకటించినట్లు ఇండియా చీఫ్ దాసరి స్వప్న మహేష్ తెలిపారు.

గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో అంకం జ్యోతి, ఆమె భర్త సంతోష్ కుమార్ కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, అవసరమైన వారికి తోడుగా నిలవడం, బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం వంటి కార్యక్రమాల ద్వారా వారు గుర్తింపు పొందారు.

అంకం జ్యోతి ‘తెలంగాణ రత్న’ అవార్డుకు ఎంపిక కావడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భర్త సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తమ సేవను గుర్తించి అవార్డు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply