వైభవంగా శత చండీ మహాయాగం..

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : స్థానిక న్యాల్కల్ రోడ్డులోని లలిత ఆశ్రమ ఆలయంలో ఆలయ ధర్మాధికారి రాజేంద్ర శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు చందు శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శత చండీ మహాయాగం మూడో రోజు కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా, కన్నులపండువగా నిర్వహించారు.

శత చండీ మహాయాగాన్ని బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ, బ్రహ్మశ్రీ గంగవరం రామశర్మ, బ్రహ్మశ్రీ ఆంజనేయ శర్మ, బ్రహ్మశ్రీ వేలేటి పశుపతి శర్మల పర్యవేక్షణలో అనేకమంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

పూర్ణాహుతితో శత చండీ మహాయాగం విజయవంతంగా పూర్తయిందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు మహా అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గాలి నాగరాజు, కొమ్మ సుధాకర్, మోటూరి వెంకటేశం, కస్తూరి శ్రీనివాస్, శేఖర్‌తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply