టీఎన్జీఓ ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఎన్జీఓ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులు, వారి సహాయకులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి మారం జగదీష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీధర్, జిల్లా సంఘ నాయకులు కొమురయ్య, మహేందర్ రెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్, యూనిట్ బాధ్యులు పురుషోత్తం రెడ్డి, సందీప్ రావు, భాగ్యమ్మ, రాజిరెడ్డి, రాజాప్రసాద్, రామచంద్రం, సుధాకర్ రెడ్డి, తనూరాయ్, అఖిల్, సాయి, వినయ్, వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.