దండేపల్లిలో ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు

దండేపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ ఆధ్వర్యంలో గురువారం దండేపల్లిలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జయశంకర్ సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

గ్రామ సర్పంచ్ అజ్మీరా రాజేశ్వర్ నాయక్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్ట వెంకటేష్ మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ సార్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేక విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం బొలిశెట్టి సౌజన్య, మొదంపురం వెంకటేష్, వేమూనూరి లక్ష్మీనారాయణ, వేమూనూరి రమేష్, నూతుల శ్రీకాంత్, కటుకూరి రాజన్న, తుపాకుల శేఖర్, పాలకుర్తి లక్ష్మణ్, జంభోజు లింగమూర్తి, కట్ట శ్రీధర్, చీర్ల వెంకటేశ్వర్లు, గడిపెల్లి సత్యం, పూరెళ్ల లక్ష్మణ్, నాగన్న, అల్లంల సంతోష్, వేమూనూరి సత్యనారాయణ, వెంకటేష్, కరుణాచారి, జనార్దన్, పాత శ్రీనివాస్, దేవరకొండ లక్ష్మీనారాయణ, కోటేష్, తిరుపతి, ఇనుగుర్తి శ్రీనివాస్, వేమూనూరి రవి, ఆల్వాల సత్యం, క్వాజా మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.