నోష్ ల్యాబ్‌ను వెంటనే తొలగించాలి

నోష్ ల్యాబ్‌ను వెంటనే తొలగించాలి
- ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ మేడి హరికృష్ణ
చిట్యాల, ఆంధ్రప్రభ: బొంగోని చెరువు పరిధిలోని నోష్ రసాయన ల్యాబ్‌లో జరిగిన రియాక్టర్ పేలుడులో ఒక నిరుపేద కార్మికుడు మృతి చెందడం, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరమని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ పేర్కొన్నారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ జనావాసాలకు, పర్యావరణానికి ముప్పుగా మారిన ఈ రసాయన ల్యాబ్‌ను చిట్యాల మండలం నుండి వెంటనే తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ల్యాబ్ యాజమాన్యంపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.
మరణించిన కార్మికుడి కుటుంబానికి భారీ పరిహారం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ల్యాబ్‌ల వల్ల పదేపదే ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు నిద్రమత్తు వీడి తనిఖీలు చేపట్టాలని మేడి హరికృష్ణ సూచించారు. లాభాల కోసం కార్మికుల ప్రాణాలను బలిపీఠం ఎక్కించడం అమానుమని నోష్ ల్యాబ్‌ను ఇక్కడి నుంచి వెంటనే తొలగించాలని సూచించారు.
