ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
పరకాల, ఆంధ్రప్రభ: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ ఎం. మంజుల జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు. ఆయన చేసిన సేవలను విద్యార్థులు తెలుసుకుని, స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎండీ సర్దార్, స్టాఫ్ సెక్రటరీ కృష్ణమోహన్ ప్రసాద్, వీర్య, వెంకట్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రాజు, వీర జగన్నాథ్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
