సాయిగూడెంలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం సాయిగూడెం గ్రామంలో గురువారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో కె. సత్యాంజనేయ ప్రసాద్, ఎంఈఓ ఎర్ర లక్ష్మి, సర్పంచ్ గ్యార కవిత, ఆర్‌ఐ పూర్ణచందర్ రావు, పంచాయితీ కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
