పాండవాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఫాస్ట్ ట్రాక్ సేవలు
పాండవాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఫాస్ట్ ట్రాక్ సేవలు
- ఐదు మండలాల వారికి రుసుము చెల్లింపు మినహాయింపు
కడెం. ఆంధ్రప్రభ: కడెం మండలంలోని పాండవ పూర్ గ్రామం వద్ద ఆటవిశాఖ చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటుచేసిన వాహనాల ఫాస్ట్ ట్రాక్ సేవలను ఆట విశాఖ ఉన్నత అధికారులతో కలిసి వన్య ప్రాణి సంరక్షణ బోర్డు మెంబర్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం దస్తురాబాద్ జన్నారం, ఉట్నూర్, దండేపల్లి మండలాల వాహనదారులకు రుసుము చెల్లింపు మినహాయింపు ఉంటుందన్నారు. కాగా ఖానాపూర్ పెంబి మండలాల వాహనాలకు కూడా రుసుము చెల్లింపు మినహాయింపు ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే నిర్మల్ డీఎఫ్ఓకు కోరారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్, బోపడే ఖానాపూర్ ఎఫ్డీఓ శివకుమార్, కడం ఎఫ్ఆర్ఓ గీతా రాణి, నిర్మల్ డిసిసి ప్రధాన కార్యదర్శి పి సతీష్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ గుప్త , పాండవపూర్ పిఎసిఎస్ చైర్మన్ రామడుగు శైలజ, కడెం మండల తహసిల్దార్ ఖాజా మొయినుద్దీన్, డిటి డిసిసి కార్యదర్శి బి దేవేందర్ గౌడ్, పెద్దూర్ కడెం పాండవపూర్ చిట్యాల లక్ష్మీ సాగర్, ఎలగడప, సారంగాపూర్ అంబారిపేట్ ,పెద్ద బెల్లాల్, బెల్లాల్ నచ్చన్ ఎల్లాపూర్ గ్రామాల సర్పంచ్ లు దీకొండ విజయకుమార్, ఆడే విజయ ఉత్తర్, నర్సింగ్ ,అశ్విత ,రమేష్ బొడ్డు, స్పందన ,గంగన్న, రాజు నాయక్ , కోల అశ్విత ,,శ్రీనివాస్ , ఈదుల తిరుపతి బొంతల లక్ష్మీ భూమన్న చీమల భీమేష్ టి రమేష్ యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కడెం రేంజ్ పరిధిలోని డిఆర్ఓలు , ఎఫ్ఎస్ఓలు, ఎఫ్బీఓలు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
