డిజిటలైజేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఏవో

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మేజర్ గ్రామపంచాయతీలోని ఈఎఫ్ డిజిటల్లైజేషన్ కేంద్రాలను ఆదివారం ఉట్నూర్ డీఏఓ సబ్బ రమేష్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇప్పటివరకు 45 శాతం పూర్తి అయిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాహసిల్దార్ బక్కయ్య, డిప్యూటీ తాహసిల్దార్ మక్సూర్ అలీ, ఎమ్మారై వెంకటేశం, పొనకల్ సర్పంచి జక్కు సుష్మ- భూమేష్, కార్యదర్శి రాహుల్, పలువురు బిఎల్వోలు పాల్గొన్నారు.