వంట గ్యాస్ అందక.. తప్పని ఇబ్బందులు

వంట గ్యాస్ అందక.. తప్పని ఇబ్బందులు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: గ్యాస్ వినియోగదాలకు సకాలంలో గ్యాస్ అందక నానా అవస్థలు పడుతున్నారు. బుకింగ్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ గ్యాస్ బుక్ అయినప్పటికీ అందకపోతే ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. నిదర్శనగా చిట్యాల గ్రామంలో ఉదయం 5 నుండి సిలిండర్లు వరుసలో పెట్టి ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. భారత్ గ్యాస్ యజమాన్యం ఇప్పటివరకు కూడా ఇవ్వలేదని, గ్యాస్ కోసం ప్రజలు రెండు నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నామని బీసీవి ఎన్నిసార్లు బుక్ చేసినా గ్యాస్ రావడం లేదని ఎక్స్ వాపోయారు. ఎండాకాలం ఎండలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామన్నారు. గ్యాస్ బుకింగ్ సమయానికి తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నది ఇకనైనా అధికారులు గ్యాస్ ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. తొర్రూరు పట్టణంలో కూడా ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోగ్యాస్ పంపిణీ దారులపై అధికారులు ప్రత్యేక శ్రద్దతీసుకుని ప్రణాళిక గా వినియోగదారులకు గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.