నీటి సమస్యకు తక్షణ పరిష్కారం.. సర్పంచ్ చొరవపై ప్రశంసలు
బోరు మోటార్ చెడిపోవడంతో వెంటనే కొత్త మోటార్ ఏర్పాటు.. కాలనీవాసుల్లో హర్షం
నడిగూడెం, ఆంధ్రప్రభ: మండలంలోని రత్నవరం గ్రామంలో బూరుగడ్డ రాములమ్మ ఇంటి సమీపంలోని బోరు మోటార్ అకస్మాత్తుగా చెడిపోవడంతో కాలనీవాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే గ్రామ సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు స్పందించారు. కొత్త మోటార్‌ను వెంటనే తెప్పించి సిబ్బంది సహాయంతో అమర్చేలా చర్యలు చేపట్టారు.
కొత్త మోటార్ ఏర్పాటు అనంతరం కాలనీవాసులకు నీటి సరఫరా పునరుద్ధరించబడింది. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించి, నీటి సరఫరాను పునరుద్ధరించిన సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావుకు కాలనీవాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
