Tiger | గోపాలపురంలో పెద్దపులి కలకలం..

మరో దూడపై దాడి


Tiger | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో మరో దూడపై పెద్దపులి దాడి చేయడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అటవీశాఖ అధికారుల సమాచారం ప్రకారం.. మంగళవారం రాత్రి కరిచర్లగూడెం కొబ్బరి తోట ప్రాంతం నుంచి పెద్దపులి బయటకు వెళ్లింది. ప్రస్తుతం కొవ్వూరుపాడు, బుచ్చియ్యపాలెం, కరగపాడు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

పెద్దపులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీశాఖ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అడవివైపు వెళ్లొద్దని, పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని అటవీశాఖ అధికారులు సూచించారు.