కాడెడ్లు మృతి చెందిన రైతుకు ఆర్థిక సహాయం
కాడెడ్లు మృతి చెందిన రైతుకు ఆర్థిక సహాయం
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామ రైతు బత్యేం సమ్మయ్యకు చెందిన మూడు పశువులు ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందటంతో సోమవారం మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ పరామర్శించి రూ. 5000 రూపాయలు అందజేశారు. అదేవిదంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం దగ్గరకు వెళ్లి కాంటాలు కాకపోవడం గురించి, బస్తాలు లేకపోవడం గురించి, లారీలు రాకపోవడం గురించి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా నాయకులు రావుల రవిచంద్ర రెడ్డి, గ్రామ సర్పంచ్ కందుకూరు ఉప్పలయ్య, ఉప సర్పంచ్ బండారు యాకన్న, దేవేంద్ర, మాజీ సర్పంచ్ పోతకం సుధాకర్, బండి శ్రీనివాస్ , వాలేరు దశరథం, గొట్టిపర్తి వెంకన్న , వల్లాల కొమురయ్య, గ రైతులు పాల్గొన్నారు.
