మహిళల ఆర్థిక అభివృద్ధి, సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆర్థిక అభివృద్ధి, సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

  • ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ:

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి, సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

నాగర్‌కర్నూల్‌లో మహిళా శక్తి భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జూన్ 3న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేయడమే తమ లక్ష్యమని, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, స్థానిక కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply