ఈ నెల 5 న మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక

ఈ నెల 5 న మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక
మున్సిపల్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ఎంపిక
మోత్కూర్, మే 3 (ఆంధ్రప్రభ) మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో 4 కో ఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి ఈ నెల 5 న (మంగళవారం) ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కె సతీష్ కుమార్ ఆదివారం విలేకరులకు తెలిపారు.ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం కలిగిన కేటగిరీ కింద ఇద్దరు వ్యక్తులు, మైనార్టీ వర్గానికి సంబంధించిన కేటగిరి కింద ఇద్దరు వ్యక్తుల చొప్పున మొత్తం నలుగురు కో ఆప్షన్ సభ్యుల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సకాలంలో చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గం సభ్యులు హాజరు కావాలని కోరారు.
