బీఆర్ఎస్ మున్సిపల్ ఫోర్ లీడర్ గా శేఖర్ గౌడ్
బీఆర్ఎస్ మున్సిపల్ ఫోర్ లీడర్ గా శేఖర్ గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ భారత రాష్ట్ర సమితి ఫ్లోర్ లీడర్ గా 5వ వార్డ్ కౌన్సిలర్ కోయ్యడ శేఖర్ గౌడ్ ను నియమిస్తూ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియామకం ఉత్తర్వులు జారీ చేశారు. సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఫ్లోర్ లీడర్ గా తనను నియమించిన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ అభివృద్ధి కోసం శక్తివంతం లేకుండా కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ ప్లోర్ లీడర్ గా శేఖర్ గౌడ్ నియామకం పట్ల పార్టీ నాయకులు, వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
