బాసరలో భక్తుల కోలాహలం

  • భారీగా చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు
  • ఆలయానికి రూ. 10 లక్షల పైగా ఆదాయం బాసర

బాసర, ఆంధ్రప్రభ: చదువుల తల్లి కొలువైన బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం భక్తుల కోలాహలం నెలకొంది. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించెందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం నుండి భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నది తీరనగల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారి దర్శన అక్షరాభ్యాసం పూజల క్యూలైన్ లో బారులు తీరారు.

అక్షరాభ్యాస పూజలకు భారీగా భక్తులు తరలిరావడంతో పూజలకు అధిక సమయం పట్టింది. భక్తులు తమ చిన్నారులకు అర్చకుల చే అక్షరాభ్యాస పూజలు జరిపించి, అమ్మ వార్లను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. అక్షరాభ్యాస పూజలు లడ్డు ప్రసాదాలు ఇతరత్రా వాటి ద్వారా ఆలయానికి 10 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.