election | బీఆర్ఎస్ జెండా ఎగరాలి

election | బీఆర్ఎస్ జెండా ఎగరాలి
election | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటీకి త్వరలో జరగ నున్న మున్సిపల్ ఎన్నికల్లో(election) 12 కౌన్సిలర్లతో పాటు చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలని నకిరేకల్ మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రోజు చిట్యాలలో మున్సిపల్ ఎన్నికలపై ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 12 వార్డులకు ఇన్చార్జిలను నియమించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ… పట్టణంలో మనం చేసిన అభివృద్ధి పనులను అన్ని వార్డులలో ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగించాలని ప్రతి ఒక్కరు అందరూ కష్టపడి పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడల ఆది మల్లయ్య, చేపూరి రవీందర్, పొన్నం లక్ష్మయ్య, మెండే సైదులు, కూరెళ్ల లింగస్వామి, కోళ్లను వెంకటేష్, కొలను సతీష్, ఆవుల ఆనంద్, ఆగు అశోక్, చిత్రగంటి ప్రవీణ్ తదితరు పాల్గొన్నారు.
