అమరావతి అద్భుత విజయం
–ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన అమరావతి
-కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టిన సందీప్
-ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సందీప్
ఆంధ్రప్రభ, విజయవాడ: ఏపీఎల్ 2026 సీజన్ 5 లో భాగంగా మంగళగిరి వేదికగా మూడవరోజు మొదటి మ్యాచ్లో విజయవాడ సన్ షైనర్స్ , క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు తలపడ్డాయి. మొదటగా టాస్ గెలిచిన అమరావతి జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన విజయవాడ సన్ షైనర్స్ జట్టు ఆదిలోనే ఓపెనర్ అభినవ్ వికెట్ ను కోల్పోయింది.
దీంతో మన ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ , వన్డే బ్యాట్స్మెన్ హర్షవర్ధన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అశ్విన్ హెబ్బార్ 25 బంతుల్లో 39 పరుగులు 4 ఫోర్లు 1 సిక్సర్, హర్షవర్ధన్ 27 బంతుల్లో 37 పరుగులు 3ఫోర్లు 1సిక్స్, డిబి ప్రశాంత్ 31 బంతుల్లో 47పరుగులు 3ఫోర్స్ 2 సిక్సర్స్ తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో 20 ఓవర్లు ముగిసే సరికి 170 పరుగులకు విజయవాడ సన్ షైనర్స్ జట్టు ఆల్ అవుట్ అయ్యింది. అమరావతి బౌలర్ల లో టోషిత్ యాదవ్ , బండారు అయ్యప్ప రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం 171 పరుగుల లక్ష్య చేదనకు బరిలోకి దిగిన అమరావతి రాయల్స్ జట్టుకు కెప్టెన్ ఓపెనర్ యారా సందీప్ టీమును ఒంటి చేత్తో గెలిపించాడు. ఏకంగా 61 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. 6 ఫోర్లు 6 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు మరొక ఎండ్లో ఎస్డిఎన్వి ప్రసాద్ 18 బంతుల్లో 27 పరుగులు 3ఫోర్లు 1 సిక్స్ దీనితో 19 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి అమరావతి జట్టు విజయం సాధించింది. విజయవాడ బౌలర్లలో లలిత్ మోహన్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సందీప్ ఎంపికయ్యాడు.


