ధైర్యంగా కొట్లాడు.. అండగా ఉంటాం..

  • బాల్క సుమన్ తో కేటీఆర్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలపై ధైర్యంగా పోరాడాలని, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ ఎంపీ బాల్క సుమన్‌కు సూచించారు.

చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం శుక్రవారం బాల్క సుమన్ హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు.

ఉద్యమ స్ఫూర్తితో ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నిస్తూ పోరాడుతున్నందుకు బాల్క సుమన్‌ను కేటీఆర్ అభినందించారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీస్తున్నావని, ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.