చౌటుప్పల్ మున్సిపల్ కో ఆప్షన్ పదవులకు ఆరు దరఖాస్తులు..

చౌటుప్పల్ మున్సిపల్ కో ఆప్షన్ పదవులకు ఆరు దరఖాస్తులు..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల పదవులకు ఇప్పటి వరకు ఆరుగురు తమ నామినేషన్లను దాఖలు చేసినట్లుగా చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్రామిరెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 17వ తేదీ వరకు అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని, మున్సిపల్ కార్యాలయంలో ఇప్పటి వరకు సందగళ్ళ విజయ (బీసీ – బి), మహమ్మద్ బాబా షరీఫ్ (బీసీ – ఈ, మైనార్టీ), పస్తం గంగారాములు (ఎస్సీ), షేక్ జానీ బాబు (బీసీ – బి మైనార్టీ), షేక్ నబీ బి (బీసీ – ఈ దూదేకుల), మహమ్మద్ నస్రీన్ సుల్తానా (బీసీ – ఈ మైనారిటీ) నామినేషన్లు వేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను పరిశీలించబోమని, నిబంధనల ప్రకారం కౌన్సిల్ ద్వారా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని కమిషనర్ వెంకట్రాంరెడ్డి తెలిపారు.
