ఆలయానికి రూ.5 లక్షల విరాళం….

ఆలయానికి రూ.5 లక్షల విరాళం….

ఫుడ్ చైర్మన్ గోలిశ్రీనివాస్ రెడ్డి…

వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల సమీపంలోని చెర్కూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ శ్రీ శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి 5లక్షల రూపాయల చెక్కు ని ఆలయ కమిటీ నిర్వాహకులు గోలి గోవర్ధన్ రెడ్డికి మంగళవారం అందచేశారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోలి రాజేందర్ రెడ్డి, గోలి విష్ణువర్ధన్ రెడ్డి, అల్లె సందీప్ గంగపుత్ర, కేశమోని రామచంద్రయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply