Parakala | సొంత గూటికి చేరిన నాయకులు…

Parakala | సొంత గూటికి చేరిన నాయకులు…

Parakala | పరకాల, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ సొంత గూటికి చేరిన నాయకులు. పరకాల పట్టణం లోని 1వ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు బండారి సుగుణాకర్, 5వ వార్డుకు చెందిన యాట ప్రశాంత్ లు బుధవారం రోజు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై నమ్మకంతోనే తాము తిరిగి సొంత గూటికి చేరుతున్నామని చేరిన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చందుపట్ల నరసింహారెడ్డి, పరకాల పురపాలక సంఘం 17వ వార్డు మాజీ కౌన్సిలర్ పాలకుర్తి గోపి, బీఆర్ఎస్ నాయకులు గురుజపల్లి ప్రకాష్ రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply