నరసింహ స్వామి దేవాలయంలో ఉచిత దర్శనం
నరసింహ స్వామి దేవాలయంలో ఉచిత దర్శనం
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు, దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత దర్శన సౌకర్యం కల్పించినట్లు దేవాలయ ఈవో సాకే రమేష్ బాబు, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజులు తెలిపారు. స్వామివారి దర్శనం కొరకు వచ్చే భక్తులు ఎటువంటి దర్శన రుసుము చెల్లించకుండా, ఉచితంగా దర్శించు కొనవచ్చని వారు తెలిపారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా క్యూలైన్లు, త్రాగు నీరు, ఇతర ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు క్రమశిక్షణతో దర్శనానికి సహకరించి, స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.
