Gun Fire | ఆమెరికాలో కాల్పులు – 11 మందికి గాయాలు

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్‌ కరోలినా బీచ్‌ టౌన్‌లోని లిటిల్‌ రివర్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో 11 మంది గాయపడటంతో హారీ కౌంటీ పోలీసులు వారిని దవాఖానకు తరలించారు. అయితే కాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారో అధికారులు స్పష్టతనివ్వలేదు. కాల్పులకు గల కారణాలు, నిందితులు ఎవరూ అన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎవరైనా అనుమానితుల్ని విచారిస్తున్నారా అనే విషయాలను కూడా పోలీసులు వెల్లడించలేదు. ఘటనా స్థలంలో పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు కనిపించిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటన జరిగిన ప్రాంతాల్లో బోటింగ్ వ్యాపారాలు మాత్రామే ఉన్నాయని స్థానిక మీడియా తెలిపింది.

Leave a Reply