సర్పంచులు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకు శిక్షణ
సర్పంచులు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకు శిక్షణ
కేసముద్రం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు మూడవ రోజైన బుధవారం కేసముద్రం మండలంలోని సర్పంచులు , మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం విలేజ్ పాఠశాలలో మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపు కోసం సర్పంచ్ , మున్సిపల్ కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వ పాఠశాలలో మంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.
మధ్యాహ్న భోజనం, యూనిఫాం బట్టలు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, విద్యార్ధికి కిట్, బ్రేక్ ఫాస్ట్ మొదలగు సదుపాయాలు కల్పించబడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్, తాళ్లపూసపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కోట కనకయ్య, రిసోర్స్ పర్సన్లు గనె యాదగిరి, వట్నాల సత్యనారాయణ, ఎం.ఐ.ఎస్. కోఆర్డినేటర్ షేక్ ఖాదర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వెన్ను బిక్షపతి, సి.ఆర్.పి.లు నేరెళ్ల పద్మ, చీర మురళి, ఇస్సంపల్లి ఉదయ్, పులి సరిత, మెసెంజర్ బిక్షపతి పాల్గొన్నారు.
