బందెలదొడ్డిని తలపిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్
నిర్వహణ లేక అధ్వాన్న స్థితి.. శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తేవాలని గ్రామస్థుల విజ్ఞప్తి
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవుల గ్రామంలో ప్రజా అవసరాల కోసం నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్వహణ లేక అధ్వాన్న స్థితికి చేరుకుంది. భవనం ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు కలుపు మొక్కలు విస్తరించాయి. పశువుల సంచారంతో హాల్ పరిసరాలు బందెలదొడ్డిని తలపించేలా మారాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్వహణ లోపం కారణంగా కమ్యూనిటీ హాల్‌ను సామాజిక కార్యక్రమాలకు వినియోగించలేని పరిస్థితి నెలకొన్నదని వారు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి భవనాన్ని శుభ్రపరచడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.
