పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 59వ జన్మదిన వేడుకలను చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. పుట్టినరోజు వేడుకల సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీకి చేరుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మికి మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పారిశుధ్య కార్మికులకు దుస్తులు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను గౌరవించారు. పట్టణ పరిశుభ్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులకు నూతన దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మి చేతుల మీదుగా సుమారు 120 మంది పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి నూతన దుస్తులు, పండ్లు అందజేశారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే కార్మికులకు తన పుట్టినరోజు సందర్భంగా దుస్తులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.

దేవాలయంలో పూజలు, అనాధాశ్రమంలో అన్నదానం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ పుణ్య లింగేశ్వరస్వామి అమ్మానాన్న అనాధ ఆశ్రమంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరుతో అర్చన చేయించారు. అనంతరం ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాధలకు అన్నదానం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జి పబ్బు రాజు గౌడ్, ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తిరుపతి రవీందర్, ఫిషరీస్ జిల్లా చైర్మన్ పాశం సంజయ్ బాబు, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెలగ రాజశేఖర్ రెడ్డి, నాయకులు బత్తుల విప్లవ్, దేప రాజు, ఊడుగు రమేష్, సందగళ్ల సతీష్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply