కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్ద మల్లారెడ్డి సొసైటీ ప్రత్యేక అధికారి సురేష్ కుమార్ చెప్పారు. శుక్రవారం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ సాయ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని తెలిపారు.
సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం విక్రయించాలనీఆయన సూచించారు దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని సూచించారు .రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ సత్యం, సొసైటీ కార్యదర్శి మోహన్ గౌడ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి లత, సొసైటీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు
