AP | విద్యార్థి ఆత్మహత్య..

AP | విద్యార్థి ఆత్మహత్య..
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఎం.టెక్ విద్యార్థి తరుణ్ శ్రీసాయి కిరణ్ రెడ్డి (23) ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
సీబీఎమ్ కాంపౌండ్ ప్రాంతానికి చెందిన తరుణ్ శ్రీసాయి కిరణ్ రెడ్డి ఎం.టెక్ ప్రాజెక్టులో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న త్రీ టౌన్ ఎస్ఐ శకుంతల ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
