తడి పొడి చెత్త వేరువేరుగా వేయాలి

సర్పంచ్ అంజనీ భాయ్

తాడ్వాయి, ఆంధ్ర ప్రభ : తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీ వాడి గ్రామంలో తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా సేకరించడంపై గ్రామస్తులకు అవగాహన కల్పించిన గ్రామ సర్పంచ్ అంజనీ భాయ్. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ… తడి చెత్త బుట్టాలో కుళ్లిపోయిన కూరగాయలు, నానిన వస్తువులు, మిగిలిపోయిన ఆహారం, పాడైపోయిన మాంసాహారం, వాడిపోయిన పూలు వేయాలని సూచించారు. అలాగే పొడి చెత్త బుట్టలో కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు వేయాలని సూచించారు. శానిటరీ వ్యర్ధాల కోసం ఏర్పాటుచేసిన డబ్బాలో శానిటరీ ప్యాడ్లు వేయాలని, ప్రమాదకర వ్యర్థాల కోసం ప్రత్యేక బుట్టాలు పెయింటింగ్ డబ్బాలు, గడువు ముగిసిన మందులు,మందు సీసాలు, వాడిన సిరంజీలు వంటి వేయాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లిక, రఘుపతిరావు , రవీందర్రావు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.