బోయపల్లి, కత్తెర్ల శివారు భూముల సర్వే ప్రారంభం

  • రెండవ రోజు కొనసాగుతున్న భూముల సర్వే

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: గత రెండు దశాబ్దాలుగా తమ భూములు ఎక్కడున్నావో తెల్వగా నిరుపేద రైతులు గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాల ఆధారంగా భూములు సాగు చేసుకుంటున్నారు. రెండు దశాబ్దాలుగా తమ భూములు ఎక్కడో ఎక్కడున్నాయో తెలియక ఇతర సర్వే నెంబర్లో భూములు సాగు చేస్తుండగా వారికి దినదిన ఘనంగా తయారయింది. బాధితులు జిల్లా కలెక్టర్ బెల్లంపల్లి సబ్ కలెక్టర్లను న్యాయం కోరుతూ ఆశ్రయించారు.

వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ స్థానిక సబ్ కలెక్టర్ తాండూర్ మండలం బోయపల్లి శివారులోని తొమ్మిది కత్తెర్ల శివారులోని 45 సర్వే నెంబర్లలో భూముల సర్వేకు ఆదేశించింది. దీంతో గురువారం రెండోవ రోజు బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే గణేష్ జాదవ్, మరో ఇద్దరు లైసెన్సుడు సర్వేయర్లతో సర్వ సిబ్బందితో కలిసి భూముల సర్వేకు శ్రీకారం చుట్టారు. 20 ఏళ్లుగా రైతులు రైతులు పడుతున్న ఇబ్బందులకు స్థిరపడే అవకాశాలు నెలకొన్నాయి.

9 వ సర్వే నెంబర్ లో 493.4, ఎకరాలు,40 వ సర్వే నెంబర్ లో 411.6 ఎకరాల భూములు ప్రభుత్వ భూమి ఉంది. భూముల్లో నేడు కొందరు రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఈ విషయంపై డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్లాంట్ సర్వే గణేష్ యాదవ్ ను వివరణ కోరగా సర్వే నెంబర్ 9లో పట్టాలు పొందిన రైతులు సర్వే నెంబర్ 40 లో భూములు సర్వే చేస్తున్నారని మొత్తం రెండు సర్వే నెంబర్లలోఉన్న మొత్తం 905 ఎకరాల భూమి ని సర్వే చేస్తున్నట్లు తెలిపారు. మొదట గ్రామాల సరిహద్దులు నిర్వహించి ఆ తర్వాత ఎంజాయ్మెంట్ సర్వే చేసిన తర్వాత రెండు సర్వే నెంబర్లలో సాగులో ఉన్న రైతుల కు మిగులు భూములు ప్రభుత్వం సర్దుబాటు చేస్తుందని పేర్కొన్నారు.