ఎస్సైకి ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల సన్మానం..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన గూడేటి. రాజవర్ధన్‌ను బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం ఆయనకు స్వీట్లు తినిపించి, నూతన బాధ్యతల్లో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల శ్రీనివాస్, తోట మోహన్, బొడ్డు కమలాకర్, వనపర్తి రవి, కంది సతీష్ కుమార్, తోట రాజన్న తదితరులు పాల్గొన్నారు.
