High Court | పోక్సో కేసులో ఊరట…
High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పోక్సో కేసులో అరెస్టైన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో బండి భగీరథ్‌ను పోలీసులు మే 16న అరెస్టు చేశారు. అనంతరం ఆయన న్యాయస్థాన ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా దాఖలైన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులకు లోబడి భగీరథ్ విడుదల కానున్నారు. కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగనుంది.
రూ.1 లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని, కోర్టు విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆదేశిస్తూ భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు పరీక్షలు రాసేందుకు లోయర్ కోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక (ఇంటరిమ్) బెయిల్ ఇవ్వగా.. గడువు ముగిసిన తర్వాత ఆయన జూన్ 25న తిరిగి జైలులో లొంగిపోయారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
