పర్యావరణ పరిరక్షణకుముందుకు రావాలి

బాసర, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఐ దీపక్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.