Sunrisers Hyd | ఎస్‌ఆర్‌హెచ్‌కు బిగ్ బూస్ట్..

Sunrisers Hyd | ఎస్‌ఆర్‌హెచ్‌కు బిగ్ బూస్ట్..

Sunrisers Hyd | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జట్లు గాయాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊరటనిచ్చే వార్త అందింది. కెప్టెన్ పాట్ కమిన్స్ మళ్లీ జట్టులో చేరనున్నాడన్న సమాచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త అందింది. వెన్నునొప్పి గాయం కారణంగా కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న కెప్టెన్ పాట్ కమిన్స్ పూర్తిగా కోలుకున్నారు. దీంతో అతనికి ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇచ్చింది. కమిన్స్ ఇవాళ (మార్చి 24) బెంగళూరుకు చేరుకుని జట్టుతో కలవనున్నారు. అయితే గాయం నుంచి తాజాగా కోలుకున్న నేపథ్యంలో, మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే తొలి మ్యాచ్‌లో అతను ఆడుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు.

కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు, శ్రీలంక యువ బౌలర్ ఎషాన్ మలింగా ఎస్‌ఆర్‌హెచ్ క్యాంపులో చేరడం జట్టుకు మరింత బలాన్ని చేకూర్చింది. శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి అనుమతి లభించడంతో మలింగా కూడా ఈరోజే జట్టుతో కలవనున్నారు. దీంతో ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్ జట్టు మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది.